Tue Dec 24 2024 02:52:09 GMT+0000 (Coordinated Universal Time)
చీతాలను పార్క్ లో వదిలిన మోదీ
ప్రధాని నరేంద్రమోదీ చీతాలను కునో నేషనల్ పార్క్ లో వదిలి పెట్టారు
ప్రధాని నరేంద్రమోదీ చీతాలను కునో నేషనల్ పార్క్ లో వదిలి పెట్టారు. ఎనిమిది చీతాలను ప్రధాని మోదీ పార్క్ లోకి వదలి పెట్టారు. నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది జీతాలు ఈ పార్క్ కు ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పాలి. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఏడు దశాబ్దాల తర్వాత....
అంతరించిపోతున్న చీతాలను పునరుద్ధరించాలని ఈ చీతాలను నమీబియా నుంచి దేశానికి ప్రత్యేక విమానంలో తెప్పించారు. దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా పరిగణించారు. నేషనల్ పార్క్ లోకి చీతాలను వదిలిన ప్రధాని నరేంద్ర మోదీ బైనాక్యులర్స్ తో కాసేపు వాటిని వీక్షించారు. 74 ఏళ్ల తర్వాత ఈ చీతాలు దేశానికి చేరుకున్నాయి. ప్రధాని మోదీ వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు అధికారులున్నారు.
Next Story