కుంగిపోవద్దు…దేశం మీ వెంటే
చంద్రయాన్ 2 విషయంలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించారని, అయితే శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వమ్ము కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్ 2 సక్సెస్ కాకపోవడంపై [more]
చంద్రయాన్ 2 విషయంలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించారని, అయితే శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వమ్ము కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్ 2 సక్సెస్ కాకపోవడంపై [more]
చంద్రయాన్ 2 విషయంలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించారని, అయితే శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వమ్ము కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్ 2 సక్సెస్ కాకపోవడంపై శాస్త్రవేత్తల మానసికస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. చంద్రుడికి దగ్గరగా వెళ్లి వచ్చామని గుర్తుంచుకోవాలన్నారు. దేశం పట్ల శాస్త్రవేత్తల నిబద్దత అభినందనీయమన్నారు. మరిన్ని ప్రయోగాలను చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు ఎదురైన సవాళ్లు మనకు మరిన్ని పాఠాలు నేర్పుతాయన్నారు. మీ వెంట దేశం అండగా ఉంటుదని తెలిపారు. మీ ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాదని మోదీ తెలిపారు. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కావాలని మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారని మోదీ అన్నారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో మోదీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. శాస్త్ర వేత్తల కుటుంబాలకు తన సెల్యూట్ అని మోదీ అన్నారు.