లక్ష్యం 25 ఏళ్లు... సాధించాల్సిందే
వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తిగా మార్చి వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తిగా మార్చి వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందచేశారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని హోదాలో 9వ సారి ఎర్రకోట పై జాతీయ జెండాను మోదీ ఎగుర వేశారు. అంతకు ముందు రాజ్్ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం నవసంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. ఎంతో మంది మహనీయులకు దేశం జన్మనివ్వడం అదృష్టమన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిందని మోదీ అన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యమని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని తెలిపారు. వాటిని ఎదుర్కొని నిలిచి అభివృద్ధి వైపు పయనిస్తున్నామని తెలిపారు. దేశం ఈరోజు ఒక మైలురాయిని దాటిందన్నారు.