Mon Dec 23 2024 08:46:08 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ తల్లికి 100 ఏళ్లు.. పండగకు ప్రధాని
మోదీ తల్లి హీరాబెన్ ఈనెల 18వ తేదీన వంద ఏళ్లలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఆమె నివాసం ఉంటున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ ఈనెల 18వ తేదీన వంద ఏళ్లలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె శతవసంత వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. తన కుమారుడు ప్రధాని అయి ఎనిమిదేళ్లవుతున్నా ఆమె తన ఇంట్లోనే ఆమె నివసించడానికి ఇష్టపడుతుంటారు. ప్రతి పుట్టినరోజు వేడుకకు మోదీ హాజరవుతారు. ఆమె చేతి వంట రుచి చూస్తారు. అక్కడే కొంత సేపు గడిపి తల్లి ఆశీర్వాదం తీసుకుని వస్తారు.
60 అడుగుల రోడ్డుకు.....
ఈసారి హీరాబెన్ మోదీ శతవసంతంలోకి అడుగుపెడుతుండటంతో ప్రత్యేక పూజలు సయితం నిర్వహిస్తున్నారు. పావగఢ్ లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. అయితే మోదీ తల్లి శతవసంత వేడుకల సందర్భంగా గాంధీనగర్లోని రైసన్ పెట్రోలు బంకు నుంచి ఉన్న 60 అడుగుల రోడ్డుకు పూజ్యహీరా మార్గ్ అని పేరు పెడతారు. హీరాబెన్ 1923 జూన్ 18వ తేదీన జన్మించారు. తల్లి పుట్టినరోజు వేడుకలకు హాజరవుతున్న నరేంద్ర మోదీ నివాసంలో దాదాపు గంటకు పైగానే గడుపుతారు.
Next Story