పోలవరం అవకతవకలపై ప్రధాని కార్యాలయం ఆరా
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలపై పీఎంవో కి కేంద్ర జల శక్తి శాఖ ప్రాజెక్ట్ నివేదిక ఇచ్చింది. నిర్మాణంలో అవినీతి, అక్రమాలపై పీఎంవోకి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు [more]
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలపై పీఎంవో కి కేంద్ర జల శక్తి శాఖ ప్రాజెక్ట్ నివేదిక ఇచ్చింది. నిర్మాణంలో అవినీతి, అక్రమాలపై పీఎంవోకి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు [more]
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలపై పీఎంవో కి కేంద్ర జల శక్తి శాఖ ప్రాజెక్ట్ నివేదిక ఇచ్చింది. నిర్మాణంలో అవినీతి, అక్రమాలపై పీఎంవోకి పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ నుంచి పూర్తి వివరాలను పీఎంవో కోరింది. లవరం ప్రాజెక్టు నిర్మాణంలో పరిహారం-పునరావాసం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల శక్తి శాఖ స్పష్టం చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కాంట్రాక్టుల కేటాయింపు బాధ్యతలు ఏపీ జలవనరుల శాఖ చేపడుతోంది. పనుల్లో జాప్యం కారణంగా సెక్షన్ 60సి ప్రకారం కొత్త నిర్మాణ సంస్థకు పనులు అప్పగించారు. సవరించిన అంచనాలు, భూసేకరణ వ్యయం పెరగడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది. తాజా అంచనాలను కేంద్ర జలశక్తి శాఖ కూడా పరిశీలిస్తోందని పేర్కొంది. ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ సమాచారం మేరకు రవాణా మోసాలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న, పోలవరం తాసిల్దార్ ముక్కంటిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై నమోదైన రెండు కేసులపై విచారణ జరుగుతోందని పీఎంవోకు తెలిపింది. విచారణ పూర్తయ్యాక బాద్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. జలశక్తి శాఖ నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఉత్తర్వులకు 2019నుంచి రెండేళ్ల మినహాయింపు లభించిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తలెత్తుతున్న ఫిర్యాదులు, ఉల్లంఘనలపై రాష్ట్రాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు జలశక్తి శాఖ పీఎంవో కు తెలిపింది. కాంట్రాక్టుల కేటాయింపులు నిబంధనల మేరకు ప్రాజెక్ట్ అథారిటీ అనుమతితో చేపడుతున్నట్టు ఏపీ సర్కారు చెబుతోందని పేర్కొంది.