Mon Dec 15 2025 03:58:44 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ బోర్డు వద్ద ప్రొ.నాగేశ్వర్ అరెస్ట్..!
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ఇవాళ కూడా ఇంటర్ బోర్డు వద్ద పెద్ద ఎత్తున వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు సైతం [more]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ఇవాళ కూడా ఇంటర్ బోర్డు వద్ద పెద్ద ఎత్తున వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు సైతం [more]

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. ఇవాళ కూడా ఇంటర్ బోర్డు వద్ద పెద్ద ఎత్తున వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తల్లిదండ్రులు సైతం పెద్దఎత్తున ఇంటర్ బోర్డు వద్దకు వచ్చారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసేందుకు ప్రొ.నాగేశ్వర్ ఇంటర్ బోర్డు వద్దకు వచ్చి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులకు మదద్తు తెలిపారు. దీంతో ఆయనను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
Next Story