ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళన
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యగులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు విజయవాడ ధర్నా చౌక్ [more]
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యగులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు విజయవాడ ధర్నా చౌక్ [more]
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యగులపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధాకృష్ణ ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నాకు హాజరయ్యారు. 48 గంటల్లో ఉద్యోగులకు రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సైతం రాధాకృష్ణ వ్యాఖ్యలు సమర్ధించడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి వెంటనే రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఏబీఎన్ ఛానల్ చూడవద్దని, ఆంధ్రజ్యోతి చదవవద్దని పిలుపు నిచ్చారు.