రాజమౌళి సినిమా... రామాంజనేయుల కథ..?
69వ జాతీయ జాతీయ అవార్డులు తెలుగు చలన చిత్రాల ఖ్యాతిని దేశమంతా చాటాయి. అదే సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా మూట కట్టుకుంటున్నాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. భిన్నమతాలు, సంస్కృతులకు ఆలవాలమైన మన దేశాన్ని కాషాయీకరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా ‘హిందుత్వ’ మయం చేస్తోందనే అపప్రధను కూడా ఇప్పుడు కేంద్రం మూటగట్టుకుంటోంది.
జాతీయ అవార్డుల కాషాయీకరణపై నిరసనల వెల్లువ
69వ జాతీయ జాతీయ అవార్డులు తెలుగు చలన చిత్రాల ఖ్యాతిని దేశమంతా చాటాయి. అదే సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా మూట కట్టుకుంటున్నాయి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. భిన్నమతాలు, సంస్కృతులకు ఆలవాలమైన మన దేశాన్ని కాషాయీకరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ చలన చిత్ర అవార్డులను కూడా ‘హిందుత్వ’ మయం చేస్తోందనే అపప్రధను కూడా ఇప్పుడు కేంద్రం మూటగట్టుకుంటోంది.
అన్నింటికంటే వివాదాస్పదం కశ్మీర్ ఫైల్స్‌కు ‘నర్గీస్‌దత్’ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందివ్వడం. కశ్మీర్లో ఓ మతాన్ని తక్కువ చేస్తూ, లవ్ జిహాద్‌ను బూతద్దంలో చూపిస్తూ తీసిన ఈ సినిమా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. వివాదాలను, కలెక్షన్లను సంపాదించినా, వాస్తవ కోణంలో ఆ సినిమా తీయలేదనే విషయం తేటతెల్లమైంది. ముప్పయ్ వేల మంది హిందూ మహిళలు లవ్ జిహాద్ వలలో పడ్డారని తొలుత సినిమా నిర్వాహ కులు ప్రకటించారు. లెక్కలు అడిగే సరికి, నాలుక కరుచుకుని ఈ సినిమా ఫిక్షన్ అంటూ తప్పించుకున్నారు. కశ్మీర్లో హిందువుల ఊచకోత నిజమే కానీ, అక్కడున్న ఇతర మతాల్ని విలన్లుగా చూపించడం ఏకపక్షమని మేధావులంతా గోలపెట్టారు. ఈ విషయాన్ని కూడా పబ్లిసిటీగా వాడుకుని బీజేపీ పెద్దలు లబ్ధి పొందాలను ప్రయత్నించారు. ఓ మతాన్ని కించపరుస్తూ, ఆ వర్గానికి చెందిన వాళ్లందరినీ చెడ్డవారిగా చూపించిన సినిమాకు జాతీయ సమైక్యతా పురస్కారం ఇవ్వడం వెనుక కవి హృదయం జ్యూరీ మెంబర్లుకే తెలియాలి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయమై నిరసన తెలియజేశారు.
అలాగే రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి భారీ స్థాయిలో అవార్డులు రావడం వెనుక కూడా హిందుత్వ అజెండా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకు సీతారామరాజు, కొమరం భీమ్ అని చెప్పినా అది రామాంజనేయుల కథే అని ప్రముఖ సినీ విమర్శకులు భరద్వాజ ఆరోపించారు. అందుకే హీరో, హీరోయిన్ల పేర్లు రాముడు, సీత అని వాళ్లిద్దరినీ కలిపిన భీం ఆంజనేయుడే అని వెల్లడించారు. ఆ కాన్సెప్ట్ వల్లే ఆర్ ఆర్ ఆర్ సినిమా కేంద్ర పెద్దల దృష్టిలో పడిరదని, లెక్కకు మిక్కిలి జాతీయ అవార్డులు అందుకుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఈ సారి అవార్డుల్లో మరో వివాదం జై భీమ్ సినిమాను పూర్తిగా విస్మరించడం. జస్టిస్ చంద్రు జీవితంలో జరిగిన యధార్థ గాధ ఆధారంగా తీసిన జై భీమ్... ఓ నిమ్న కులం తరఫున పోరాడిన ఓ లాయర్ కథ. వాస్తవ సంఘటనలతో, సహజంగా తీసిన ఆ సినిమా జాతీయ అవార్డుల జ్యూరీ దృష్టిలో పడలేదంటే, ఆ సభ్యుల ‘స్థాయి’ అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డులను ప్రకటించారు. ఓ వర్గానికి చెందిన వారికే ఎక్కువ అవార్డులు రావడంతో అవి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం నంది అవార్డులనే పక్కన పెట్టేసింది. జాతీయ అవార్డులను కూడా ‘హిందుత్వ’ మైండ్ సెట్‌కే పరిమితం చేస్తే, వాటికి కూడా భవిష్యత్తులో పెద్దగా విలువ ఉండదు..