పోలీసుల తీరుపై హైకోర్టులో నేడు
లాక్ డౌన్ సందర్భంలో పోలీసులు ప్రజలపై అనుసరిస్తున్న తీరు పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపైన నేడు విచారణ జరగబోతుంది. ఒక న్యాయవాది రాసిన [more]
లాక్ డౌన్ సందర్భంలో పోలీసులు ప్రజలపై అనుసరిస్తున్న తీరు పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపైన నేడు విచారణ జరగబోతుంది. ఒక న్యాయవాది రాసిన [more]
లాక్ డౌన్ సందర్భంలో పోలీసులు ప్రజలపై అనుసరిస్తున్న తీరు పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపైన నేడు విచారణ జరగబోతుంది. ఒక న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. లాక్ డౌన్ నేపధ్యం ప్రజలు పై పోలీసులు దాడులు పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాశారు. ఐదు పేజీల లేఖ ను సీజే కి హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు. కొద్దీ రోజులు క్రితం వనపర్తి లో తండ్రి కొడుకు బైక్ పై వెళుతుండగా పోలీసులు దాడి ఘటన ను లేఖ లో ప్రస్తావన చేశారు. దాడి చేసిన పోలీసులు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టారంటూ తెలిపారు. జ్యూడిషయల్ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టే హక్కు పోలీసులకు ఏ విధంగా ఉందో తెలియజేయాలని పిటిషనర్ కోరారు. లేఖ ను ప్రజా ప్రయోజనాల వాజ్యం గా హైకోర్టు స్వీకరించింది. ఈరోజు ఉదయం 10.30 నిముషాలు కు న్యాయ స్థానం విచారణ చేస్తుంది.