Mon Dec 23 2024 22:57:34 GMT+0000 (Coordinated Universal Time)
పరారీలో ఉన్న పీవీపీ హఠాత్తుగా….?
గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న పొట్లూరి వరప్రసాద్ హటాత్తుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీవీపీపై గతంలో రెండు కేసులు [more]
గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న పొట్లూరి వరప్రసాద్ హటాత్తుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీవీపీపై గతంలో రెండు కేసులు [more]
గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న పొట్లూరి వరప్రసాద్ హటాత్తుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీవీపీపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులకు విధులకు ఆటంకం కల్గించారని ఆయనపై కేసు నమోదయింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ సమయం ముగిసిపోవడంతో పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఒక విల్లా వద్ద చెలరేగిన వివాదంలో పీవీపీకి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురి చేశారు. అప్పటి నుంచి పీవీపీ పరారీలో ఉన్నారు.
Next Story