పదిమంది నియంతల జాబితాలోకి జగన్
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 30 లక్షల ఇళ్లు కట్టాలంటే 83 వేల కోట్లు కావాలని, వాటిని ఎక్కడి నుంచి [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 30 లక్షల ఇళ్లు కట్టాలంటే 83 వేల కోట్లు కావాలని, వాటిని ఎక్కడి నుంచి [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 30 లక్షల ఇళ్లు కట్టాలంటే 83 వేల కోట్లు కావాలని, వాటిని ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలోని పది మంది నియంతల పేర్లతో జగన్ పేరును చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ స్కీమ్ కాదని స్కామ్ అని ఆయన అన్నారు. ప్రతి ఊరిలో ఒక జగన్మోహనపురం కాలనీని ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమవుతుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చీప్ పబ్లిసిటీ ముఖ్యమంత్రి జగన్ కు అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఎవరడిగారని తన భూమిని సర్వే చేసి, ముఖ్యమంత్రి బొమ్మతో సర్వే రాళ్లు ఎలా వేస్తారని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.