నేను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా దీక్ష చేశానన్నారు. [more]
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా దీక్ష చేశానన్నారు. [more]
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తాను దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా దీక్ష చేశానన్నారు. దేవాలయాలపై దాడులను వైసీపీ కూడా వ్యతిరేకించిందన్నారు. తాను చేపట్టిన దీక్షకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకమార్ మద్దతు తెలిపారన్నారు. ఆయనతో ఉన్న ఫొటోను స్పీకర్ కు ఇచ్చి తనపై అనర్హత వేటు వేయాలని విజయసాయిరెడ్డి స్పీకర్ ను కోరారన్నారు. అది పార్టీ కి అనుకూలంగా చేపట్టిన దీక్ష అని ఆయన తెలిపారు. అలాగే తాను తెలుగుభాష విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించానని, దానిని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు కాదని రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను ఇప్పటి వరకూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ విషయం చెబుతన్నారన్నారు.