Tue Dec 24 2024 16:33:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. [more]
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కూడా రఘురామకృష్ణంరాజు కోరారు. ఎంపీ వ్యాఖ్యలను ఆయన నియోజకవర్గంలోని ఐదుగురు ఎమ్మెల్యేలు ఖండించారు. వారిపైనే రఘురామకృష్ణంరాజు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనక ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story