జగన్ గారూ ఈ ప్రచారం నిజమేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఉద్యోగుల పదవీ విరమణ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఉద్యోగుల పదవీ విరమణ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 57 ఏళ్లకు కుదించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 57 ఏళ్లకు కుదిస్తున్నారన్న ప్రచారం జరుగుతుందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. దీనివల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఉద్యోగుల జీతాలను కూడా సకాలంలో చెల్లించలేకపోతున్నామని, ఇప్పుడు రిటైర్ వారికి ప్రయోజనాలు ఎలా ఇస్తామని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఒకవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గిస్తూ, మరోవైపు రిటైర్ అయిన కనగరాజ్ వంటి వారికి పదవులుఇవ్వడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. బడ్జెట్ లో ఎలాంటి వెసులుబాటు కల్పించకుండా పడబోయే ఆర్థిక భారాన్ని ఎలా తట్టుకోగలుగుతామని ఆయన లేఖలో ప్రశ్నించారు.