Mon Dec 23 2024 16:27:55 GMT+0000 (Coordinated Universal Time)
ఇలా చేస్తే ఎలా జగన్?
కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతున్న సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ఏంటని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందునే ప్రభుత్వం [more]
కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతున్న సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ఏంటని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందునే ప్రభుత్వం [more]
కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతున్న సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ఏంటని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందునే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను పొడిగించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకవైపు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ మరో వైపు పాఠశాలలను తిరిగి ప్రారంభించడమేంటని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సలహాదారుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ఆయన నిలదీశారు. విద్యార్థులకు ఏదైనా ముప్పు వాటిల్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.
Next Story