జగన్ ను ఏనాడూ వ్యతిరేకంచలేదు.. వ్యతిరేకించబోను
ముఖ్యమంత్రికి జగన్ తాను వివరణ ఇస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను జగన్ ను కాని, పార్టీని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. తనపై సోషల్ మీడియాలో [more]
ముఖ్యమంత్రికి జగన్ తాను వివరణ ఇస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను జగన్ ను కాని, పార్టీని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. తనపై సోషల్ మీడియాలో [more]
ముఖ్యమంత్రికి జగన్ తాను వివరణ ఇస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాను జగన్ ను కాని, పార్టీని కానీ పల్లెత్తు మాట అనలేదన్నారు. తనపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్ ను తాను ఏనాడు వ్యతిరరేకించనని, వ్యతిరేకించబోనని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనను శిక్షించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తనకు, జగన్ కు మధ్య గ్యాప్ సృష్టించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. తాను ఇప్పటికీ జగన్ అపాయింట్ మెంట్ ను కోరుతున్నానని చెప్పారు. అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే తాను వివరణతో లేఖ రాస్తానని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతనే తాను నియోజకవర్గానికి వెళతానని చెప్పారు. వాలంటరీగా నన్ను బయటకు పంపడానికి కుట్ర జరుగుతుందన్నారు.