Tue Dec 24 2024 01:48:14 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీపై మోదీ ఆప్యాయత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజును ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళుతున్న నరేంద్ర మోడీకి ఎంపీ రఘురామ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజును ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళుతున్న నరేంద్ర మోడీకి ఎంపీ రఘురామ [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజును ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వెళుతున్న నరేంద్ర మోడీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు సెంట్రల్ హాల్ వద్ద ఎదురయ్యారు. దీంతో రఘురామకృష్ణంరాజు నమస్కారం సర్ అంటూ రెండు చేతులూ జోడించారు. దీనికి ప్రతిగా రాజుగారూ హౌ ఆర్ యూ అంటూ మోదీ ఆప్యాయంగా ఆయన భుజం తట్టి వెళ్లిపోయారు. గతంలోనూ విజయసాయిరెడ్డిని విజయ్ గారూ అంటూ మోడీ పలకరించిన సంగతి తెలిసిందే. మోడీ పార్లమెంటు సభ్యులను గుర్తుపెట్టుకుని మరీ పేరుతో పిలవడం అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యం కల్గించింది.
Next Story