తెలుగు నేతలకు గట్టి షాకిచ్చిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఇప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి రాదని అందరూ భావిస్తున్నారు. అయితే, తెలంగాణలో కూడా అధికారంలోకి రామని స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే అంచనాకి వచ్చేసినట్లున్నారు. ప్రస్తుతం ఆయన చర్యలు చూస్తే అలానే కనిపిస్తున్నాయి. ఇటీవల వేసిన పార్టీ సీడబ్లూసీ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు 2019 ఎన్నికల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో కమిటీలను వేశారు. మొత్తం 9 మంది సభ్యులతో కోర్ గ్రూప్ కమిటీ, 19 మంది సభ్యులతో మెనిఫెస్టో కమిటీ, 13 మందితో ప్రచార కమిటీ ఏర్పాటు చేయగా ఈ కమిటీల్లో ఒక్క తెలుగు నేతకు కూడా అవకాశం ఇవ్వలేదు. మరి రెండు రాష్ట్రాల్లో ఈ కమిటీల్లో కనీసం చోటు దక్కించుకునేంత అర్హులు లేరా..? లేదా అధిష్ఠానానికి కనపడం లేదా..? లేకపోతే తెలుగు లీడర్లపై నమ్మకం లేదా..? పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకే తెలియాలి.