Tue Dec 24 2024 04:54:21 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి అందుకే చేసుకోలేదట
రాహుల్ గాంధీ తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏవీ లేవన్నారు. చేసుకోకూడదనే చేసుకోలేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు
రాహుల్ గాంధీకి పెళ్లి ఎందుకు కాలేదో ఇప్పటి వరకూ అంతుపట్టని ప్రశ్నగానే ఉంటుంది. ఆయన తనంతట తానే పెళ్లి చేసుకోవద్దని భావించారా? లేక లవ్ ఫెయిల్యూరా? అన్నది ఎవరికీ అర్ధం కాదు. రాహుల్ గాంధీ చెబితే తప్ప ఎవరికీ ఈ విషయం తెలియదు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం ఇప్పుడు పిల్లలు కావాల్సి ఉందట. ఈ విషయాన్ని ఇక ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏవీ లేవన్నారు. చేసుకోకూడదనే చేసుకోలేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.
పిల్లలు కావాలట...
తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటికి పెళ్లి ఆటంకం కాకూడదని భావించి పెళ్లికి దూరంగా ఉన్నానని రాహుల్ గాంధీ తన పెళ్లిపై కొంత స్పష్టత ఇచ్చారు. అయితే తనకు ఇప్పుడు పిల్లలు కావాలని ఉందని వ్యాఖ్యానించడం కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఆయన పిల్లల కోసం పరితపించి పోతున్నారని రాహుల్ గాంధీ కామెంట్స్ ను బట్టి అర్థమవుతుంది.
గడ్డంపై నిర్ణయం...
అయితే భారత్ జోడో యాత్ర తర్వాత తనలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. యాత్ర పూర్తయ్యే వరకూ తాను గడ్డం గీచుకోరాదని భావించానని, అయితే ఇప్పుడు గడ్డం తీసివేయడం మనస్కరించడం లేదని రాహుల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గడ్డం ఉంచినా, తీసివేసినా పెద్ద సమస్యగా ఉండదని మాత్రం రాహుల్ అన్నారు.
Next Story