Mon Dec 23 2024 08:57:21 GMT+0000 (Coordinated Universal Time)
18న వాయుగుండం.. ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..16వ తేదీకి ఆగ్నేయ బంగాళాఖాతంలో..
ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మరోసారి భారీవర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాలు వెల్లడించింది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..16వ తేదీకి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 18వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని మంగళవారం ఓ నివేదికలో పేర్కొంది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 19వ తేదీ నుండి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 17,18,19 తేదీల్లో విజయవాడ, గోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో చలితీవ్రత బాగా పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Next Story