Thu Apr 10 2025 03:02:04 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు కొన్ని వైద్య [more]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు కొన్ని వైద్య [more]

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు కొన్ని వైద్య పరీక్షలు ఆయనకు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. రజనీకాంత్ హై బీపీతో నిన్న అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు హైబీపీ ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు కూడా రజనీకాంత్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశముంది. ఇప్పటికే రజనీకాంత్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Next Story