కడసారి చూపూ దక్కలేదు
ఒకటి కాదు… రెండు కాదు….. పదిరోజులుగా ఎదురుచూశారు….. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయినా ఆ దంపతులకు తీరని అన్యాయమే జరిగింది. ఏ రాత్రి ఫోన్ [more]
ఒకటి కాదు… రెండు కాదు….. పదిరోజులుగా ఎదురుచూశారు….. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయినా ఆ దంపతులకు తీరని అన్యాయమే జరిగింది. ఏ రాత్రి ఫోన్ [more]
ఒకటి కాదు… రెండు కాదు….. పదిరోజులుగా ఎదురుచూశారు….. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అయినా ఆ దంపతులకు తీరని అన్యాయమే జరిగింది. ఏ రాత్రి ఫోన్ మోగినా ఉలిక్కిపడి అది అదే వార్తేమోనని భయం భయంగా గడిపారు ఆ కుటుంబసభ్యులు. ఇది పదిరోజుల క్రితం గోదావరిలో బోటు మునిగి దుర్మరణం పాలైన యవ ఇంజనీర్ రమ్య కుటుంబసభ్యుల గాద. బోటు మునిగి అదృశ్యమైన రమ్య తిరిగి వస్తుందని వారి కుటుంబసభ్యులు ఎదురుచూశారు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఆశలు చచ్చిపోయాయి. కనీసం మృతదేహామైనా లభిస్తుందేమో అనుకున్నారు. కాని కడసారి చూపుకు కూడా నోచుకోలేదు.
అంతిమంగా ఇదే……
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన సుదర్శన్, భూలక్ష్మి దంపతులకు పదిరోజులుగా కంటిపై కునుకు లేదు. ఈ నెల 15న పాపికొండల యాత్రకు వెళ్లిన కూతురు రమ్య జాడఇంకా లేకపోవడంతో వారు ఇంకా కోలుకోలేదు. కడుపుకు తిండలేక, కంటికి నిద్రలేక కూతురు రమ్య కోసం ఎదురు చూసి…..చూసి చాలించుకున్నారు. బోటు వెలికితీస్తారేమో.. అందులో అయినా కూతురు మృతదేహం లభిస్తుందేమోనని ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు సుదర్శన్, భూ లక్ష్మిలకు నిరాశే మిగిలింది. కడసారి చూపు దక్కకపోయినా శాస్త్రోక్తంగా కర్మకాండలైనా నిర్వహించాలనుకున్నారు. బతికి వస్తుందన్న ఆశలు కనుమరుగయ్యాయి. కనీసం మృతదేహం దొరికినా కడసారి చూసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఎదురుచూశారు. కడసారి చూపులు దక్కకపోయినా తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. రాజమండ్రిలోని కోటి లింగాల ఘాట్ వద్ద కర్మకాండలు పూర్తి చేశారు.