Tue Nov 05 2024 14:57:46 GMT+0000 (Coordinated Universal Time)
రస్నా డ్రింక్ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కన్నుమూత
రూ.5 లతో రస్నా పౌడర్ ప్యాకెట్ కొనుగోలు చేస్తే.. రూ. 32గ్లాసుల డ్రింక్ ను తయారు చేసుకునేలా ఈ ప్రొడక్ట్ ను..
ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ రస్నా వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా(85) ఇకలేరు. నవంబర్ 19వ తేదీ శనివారం నాడు ఆయన కన్నుమూసినట్లు రస్నా కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కూల్ డ్రింక్ ల రేట్లు పెరుగుతున్న రోజుల్లో.. ప్రజలకు ఉపశమనంగా రస్నా మార్కెట్లోకి వచ్చింది. తొలుత ఆరెంజ్ ఫ్లేవర్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్.. క్రమంగా రకరకాల ఫ్లేవర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ.5 లతో రస్నా పౌడర్ ప్యాకెట్ కొనుగోలు చేస్తే.. రూ. 32గ్లాసుల డ్రింక్ ను తయారు చేసుకునేలా ఈ ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రస్నా తమ ప్రొడక్ట్ ను 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది. అరీజ్ ఫిరోజ్ బెనోవోలెంట్ ట్రస్ట్ ఛైర్మన్ గా, ప్రపంచ పార్సీ ఇరానీ జొరాస్టిస్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. సాఫ్ట్ డ్రింక్స్ లో ఎన్నిరకాల కంపెనీలు వచ్చినా రస్నా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అరీజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
Next Story