చంద్రబాబుపై రవీంద్రబాబు సంచలన ఆరోపణలు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమాత్రం సరిపోని వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. విభజన హామీలు [more]
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమాత్రం సరిపోని వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. విభజన హామీలు [more]
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమాత్రం సరిపోని వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. విభజన హామీలు సాధించాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదలు, దళితులకు మేలు జరగాలన్నా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ… ‘‘పదేళ్లు రాజధానిగా హైదరాబాద్ వాడుకునే అవకాశం ఉన్నా, 200 కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో కార్యాలయాలన్నీ బాగు చేయించాక ఓటుకు కోట్లు కేసులో దొరికాక చంద్రబాబు విజయవాడ పారిపోయి వచ్చారు. అమరావతితో అన్నీ తాత్కాలిక బిల్డింగులే ఉన్నాయి, ఒక్క బిల్డింగ్ కూడా పర్మనెంటు పేరుతో కట్టలేదు. మేము ప్రత్యేక హోదా కావాలంటే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీనే బాగుంటుందని మమ్మల్ని కన్వీన్స్ చేశారు. ప్రజలనూ అలానే చేశారు. చివరకు ప్యాకేజీ రాలేదు, ప్రత్యేక హోదా రాలేదు. నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేసి మంత్రి పదవులను పంచుకున్నాక ఇప్పుడు బయటకు వచ్చారు’’.
గ్రాఫిక్స్ తప్పించి ఏమీ లేదు…
‘‘హోదా కోసం ఎంపీలతో రాజీనామాలు చేయిద్దామని జగన్ అంటే… చంద్రబాబు మాత్రం వైసీపీ ఎంపీలను హాస్యాస్పదంగా చూపించారు. చంద్రబాబు బీజేపీ ఒళ్లో కూర్చొంటే నవనిర్మాణ దీక్ష, కాంగ్రెస్ ఒళ్లో కూర్చుంటే ధర్మపోరాట దీక్ష అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ ని తట్టి ఇప్పుడు అదే పార్టీని పొగడలేము. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వచ్చానని చెప్పినా పర్సనల్ పనుల కోసమే ఎక్కువసార్లు వచ్చారు. జడ్జిలను కలిసేందుకు కూడా ఆయన ఢిల్లీకి వచ్చి రాష్ట్రం కోసం అని చెప్పేవారు. చంద్రబాబు పాలనలో అన్నిచోట్ల అవినీతి పెరిగిపోయింది. ఒకే సామాజకవర్గానికి మేలు జరుగుతోంది. దళితులు, బడుగు బలహీన వర్గాల వారి బాగోగులు పట్టించుకోవడం లేదు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌళిక సధుపాయాల కల్పనను వదిలేసి అమరావతి, పోలవరం పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ మోసం చేస్తున్నారు. చివరి పార్లమెంటు సమావేశాల వరకూ ఏదో జరుగుతుందని చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. రాష్ట్రం, పేదలు, దళితుల పరిస్థితి ఆలోచించినప్పుడు జగన్ ఒక ఆశలా కనిపించారు. చంద్రబాబు వద్ద ఒక్కో కులానికి ఒక్కో ఆర్మీ ఉంటుంది. ఎవరు ఆయనకు వ్యతిరేకంగా ఆ కులం వారితో తిట్టిస్తారు. కులతత్వ పార్టీ ఉన్న టీడీపీ మట్టి కరుస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.’’ అని ఆయన పేర్కొన్నారు.