టీవీ9 వివాదంపై రవిప్రకాష్ సంచలన ఆరోపణలు
టీవీ9 వివాదం, తనపై నమోదైన కేసులపై ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ నోరు విప్పారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ వివాదంపై ఓ వీడియోను [more]
టీవీ9 వివాదం, తనపై నమోదైన కేసులపై ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ నోరు విప్పారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ వివాదంపై ఓ వీడియోను [more]
టీవీ9 వివాదం, తనపై నమోదైన కేసులపై ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ నోరు విప్పారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ వివాదంపై ఓ వీడియోను విడుదల చేశారు. తనపై నమోదైనవి దొంగ కేసులని ఆయన పేర్కొన్నారు. టీవీ9 తాను స్థాపించానని, శ్రీనిరాజు పెట్టుబడి పెట్టారని చెప్పారు. శ్రీనిరాజు వాటాను అమ్ముకోగా మేఘా కృష్ణారెడ్డి కొంటానని చెప్పి మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు ఒప్పందం జరిగినప్పుడు టీవీ9 నిర్వహణ బాధ్యత తననే చూసుకోమని చెప్పిన వారు తర్వాత మాట మార్చారని ఆరోపించారు.
నన్ను జీతగాడిలా ఉంచాలనుకున్నారు
తనను కేవలం జీతగాడిలా, పాలేరులా ఉంచాలని చూశారని పేర్కొన్నారు. తనను ఇబ్బంది పెడతామని ముందే రామేశ్వరరావు బెదిరించారని, అన్నట్లుగానే ఆయన తప్పుడు పోలీసు కేసులు పెట్టించారని, తన సన్నిహితులను వేదిస్తున్నారని అన్నారు. పోలీసు శాఖ కూడా మైహోం గ్రూపు సంస్థల్లో ఒకటిలా మారిపోయిందని ఆరోపించారు. తాను విలువల కోసం ముందడుగు వేస్తున్నానని, తనకు అందరూ అండగా ఉండాలని కోరారు. అయితే, ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాష్ తాను ఎక్కడ ఉన్నది, తర్వాత ఎటువంటి అడుగు వేసేది మాత్రం ఈ వీడియోలో బయటపెట్టలేదు.