రెడ్ జోన్ లలో మరో రెండు నెలల పాటు?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ లలో ఇప్పుడిప్పుడే సడలింపులు ఇచ్చే అవకాశం లేదు. మరో రెండు నెలల వరకూ రెడ్ జోన్ లపై పూర్తి నిఘా [more]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ లలో ఇప్పుడిప్పుడే సడలింపులు ఇచ్చే అవకాశం లేదు. మరో రెండు నెలల వరకూ రెడ్ జోన్ లపై పూర్తి నిఘా [more]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ లలో ఇప్పుడిప్పుడే సడలింపులు ఇచ్చే అవకాశం లేదు. మరో రెండు నెలల వరకూ రెడ్ జోన్ లపై పూర్తి నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేయనునంది. రెడ్ జోన్ లలోకి ఎవరినీ అనుమతించరు. ఎవరినీ అక్కడి నుంచి బయటకు రానివ్వరు. రెడ్ జోన్ పరిధిలో ఆరోగ్య పరీక్షలు విస్తృతంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి అవసరమైన నిత్యావసరాలను పంపిణీ చేసే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కేంద్రం సూచించనుంది. రెడ్ జోన్లు పూర్తిగా గ్రీన్ జోన్లుగా మారేంత వరకూ అక్కడ ఆంక్షలు తొలిగించే అవకాశం లేదు.