యాభై చోరీలు చేసిన తర్వాత…?
పగలు రెక్కీ చేసి రాత్రి స్కెచ్ అమలు చేస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర్థ సెంచరీ చోరీలు చేశారు. వరుసగా తెలుగు రాష్ట్రాల్లో [more]
పగలు రెక్కీ చేసి రాత్రి స్కెచ్ అమలు చేస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర్థ సెంచరీ చోరీలు చేశారు. వరుసగా తెలుగు రాష్ట్రాల్లో [more]
పగలు రెక్కీ చేసి రాత్రి స్కెచ్ అమలు చేస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర్థ సెంచరీ చోరీలు చేశారు. వరుసగా తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డారు. చివరకు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి చిక్కారు. పలు ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడు గట్టున నేరగాళ్లను పక్కా ప్లాన్ వేసి సీసీ కెమెరాల ఆధారంగా సిటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట పోలీస్ సహాయంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సద్దాం అలి మరో నిందితుడు అన్వర్ అలి ఇద్దరు ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. అన్వర్ అలి & సద్దాం అలి పై 52 చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే నగరంలోని నల్లకుంట లో చోరీ చేసి పోలీసులకు చిక్కారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు విరి నేర ప్రవిట్టిని పోలీసులు బట్ట బయలు చేశారు. వీరి ఇద్దరి అరెస్ట్ తో ఇతర జిల్లాల్లో 8 చోరీ కేసులు డిటెక్ట్ అయ్యాయి. 32 లక్షల రూపాయల విలువ చేసే 61 తులాల బంగారు, 1 కిలో10 గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.