Mon Dec 23 2024 10:05:54 GMT+0000 (Coordinated Universal Time)
భారీ మెజారిటీ దిశగా మేకపాటి
ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీ దిశగా పయనిస్తున్నారు
ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీ దిశగా పయనిస్తున్నారు. 18 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ విక్రమ్ రెడ్డికి 75,785 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏ రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థికి మెజారిటీ తగ్గలేదు.
బీజేపీ ఇక్కడ....
ఇక బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు డిపాజిట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఏ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థికి వెయ్యి ఓట్లు రాలేదు. దీంతో మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయంగా కన్పిస్తుంది. మరో రెండు రౌండ్లలో పాతిక వేల ఓట్ల మెజారిటీ వస్తే లక్ష దాటుతారు. కానీ సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ప్రతి రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డికి ఆరు వేల ఓట్ల మెజారిటీయే లభిస్తుంది.
Next Story