Thu Dec 19 2024 17:12:42 GMT+0000 (Coordinated Universal Time)
కన్నడనాట ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలివే
కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తాయని చెబుతున్నాయి
కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 107 నుంచి 119 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. బీజేపీ 78 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని, జేడీఎస్ 23 నుంచి 29 స్థానాల్లోనూ ఇతరులు ఒకటి నుంచి మూడు స్థానాల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.
కాంగ్రెస్‌కే ఆధిక్యం...
రిపబ్లకి్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 94 నుంచి 108 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని తేల్చింది. బీజేపీ 85 నుంచి 100 స్థానాల వరకూ గెలుపు అవకాశాలున్నాయని తెలిపింది. జేడీఎస్ మాత్రం 24 నుంచి 32 స్థానాలు, ఇతరులు రెండు నుంచి ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని తేల్చింది. జన్ కీ బాత్ సర్వేలో కాంగ్రెస్ 91 నుంచి 116 స్థానాల్లోనూ బీజేపీ మాత్రం 94 నుంచి 117 వరకూ స్థానాల్లోనూ, జేడీఎస్ 14 నుంచి 24 స్థానాల్లోనూ, ఇతరులు 10 నుంచి పదిహేను స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని తేల్చింది.
హంగ్ వస్తుందని...
జీమార్క్ సర్వేలో బీజేపీ 87 నుంచి 94 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 103 నుంచి 118 స్థానాల్లోనూ, జేడీఎస్ 25 నుంచి 33 స్థానాల్లో గెలుస్తుందని తేల్చింది. జీ న్యూస్ సర్వే ప్రకారంకాంగ్రెస్ 103 నుంచి 118 స్థానాల్లనూ, బీజేపీ 79 నుంచి 94 స్థానాల్లోనూ, జేడీఎస్ 25 నుంచి 33 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని చెప్పింది. పోల్ స్ట్రాట్ సర్వే ప్రకారం బీజేపీ 88 నుంచి 98 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 99 నుంచి 109 స్థానాల్లోనూ, జేడీఎస్ 21 నుంచి 26 స్థానాల్లోనూ, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ గెలిచే అవకాశాలున్నాయని తేల్చింది.
Next Story