Sun Nov 24 2024 10:46:37 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీ శాఖ అధికారులతో రేవంత్....?
కొడంగల్ నుంచి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనితన ఇంటికి చేరుకున్నారు. ఆయనకు ఆదాయపు పన్ను శాఖ మరికొద్ది సేపట్లో నోటీసులు జారీ చేసే అవకాశముంది. రేవంత్ రెడ్డి తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట పెద్దయెత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సాయిమైర్య, నైమిషా కంపెనీలను ఏర్పాటు చేసి విదేశాల నుంచి నిధులను సేకరించారని కూడా చెబుతున్నారు. షెల్ కంపెనీల ద్వారా విదేశాల నుంచి నిధులను సేకరించారని ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రేవంత్ర రెడ్డితో పాటు, అల్లుడు, వియ్యంకుడి పైనా ఈ ఆరోపణలు ఉన్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అక్రమ లావాదేవీలపై ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఆయన అభిమానులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Next Story