Sun Dec 22 2024 12:34:39 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సూపర్ ప్రామిస్.. హాట్ టాపిక్
రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు
రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. దీంతో పాటు ప్రజలకు హామీ ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. ఇటీవల రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఐదు వందలకే...
దీంతో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సిలిండర్ ను ఐదు వందలకే ఇస్తామని ప్రకటించడం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేందుకు ఈ ప్రకటన ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర 1100 రూపాయలకు చేరుకుందని, తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఐదు వందలకు ఇస్తామని ప్రకటించడం మహిళల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
పాదయాత్రలో...
ఇక తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గిస్తామని రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు కూడా పెద్దయెత్తున పాల్గొంటున్నారు. కార్నర్ మీటింగ్ లకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతుండటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం కనపడుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి మీటింగ్ లకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Next Story