Thu Jan 16 2025 05:13:47 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ రెడ్డిది మైండ్ గేమ్..!
తాము పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను టీఆర్ఎస్ ఎంపీలు సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఇటువంటి చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. గురువారం మహబూబాబాద్ ఎంపీ ప్రొ.సీతారాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ... తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ ను వదిలి వెళ్లనని పేర్కొన్నారు. క్రమశిక్షణతో రాజకీయాల్లో ఉన్న తమలాంటి నేతల జోలికి రావొద్దని రేవంత్ కు హితవు పలికారు. రాజీనామా వార్తల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజీనామా వార్తలు అవాస్తవమని, కావాలని రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Next Story