రేవంత్ దే ట్రెండింగ్....!!!
తెలంగాణ ఎన్నికల్లో మాటలు తుటాల్లా పేలిపోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతుంది. పంచ్ డైలాగ్ లు పదేపదే కొడుతున్నారు నాయకులు. ప్రసంగాలు అదరగొడుతున్న వారిలో కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత గులాబీ పార్టీ తరపున ప్రత్యర్థులను తమ మాటల ద్వారా దడ దడ లాడిస్తున్నాయి. వీరి ధాటిని తట్టుకోవడానికి మహాకూటమి లోని స్టార్స్ అంతా ముప్పేట దాడి సాగిస్తున్నారు.
ట్రెండింగ్ రేవంత్ దే ...
ఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి విమర్శలు ఆరోపణల్లో ట్రెండింగ్ కొనసాగిస్తున్నారు. పిసిసి ఉత్తమకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క జోష్ మీద వున్నారు. ఇక కమలం తరపున ప్రధాని మోడీ, అమిత్ షా ఫ్రంట్ లైన్ లో వున్నారు. ఇక హాట్ కామెంట్స్ కి పెట్టింది పేరైన ఎంఐఎం అసద్ వుద్దీన్ ఒవైసి, అక్బర్ వుద్దీన్ ఒవైసీలు, టిడిపి తరపున చంద్రబాబు, బాలకృష్ణ దూసుకుపోతున్నారు. తెలంగాణ జనసమితి తరపున కోదండరాం ఒక్కరే పంచ్ లు విసురుతున్నారు.
స్టార్ట్స్ విసురుతున్న.....
చరిత్ర చింపలేరు అంటూ బాలకృష్ణ, నన్ను రాకుండా ఎవరు ఆపేది నేనే తెలంగాణ సృష్టికర్త అంటూ చంద్రబాబు పంచ్ లు కొట్టారు. ఇక కెటిఆర్ దూకుడు మరింత పెంచారు. ఎపి రాజకీయాల్లో ఇక వేలుపెట్టక తప్పదన్న హాట్ కామెంట్స్ తో వేడి పుట్టించారు. బ్రీఫ్డ్ మీ అంటూ ఓటుకు నోటు కేసులో ఆ మాట నేను కాదని చంద్రబాబు ఇప్పటిదాకా ఎందుకు అనలేదని సూటిగా ప్రశ్నించారు కెటిఆర్. ఇలా ప్రతి పార్టీ స్టార్స్ విసురుతున్న పంచ్ లతో తెలంగాణ ఓటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు
- Tags
- Balakrishna
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- ktr
- left parties
- nara chandrababu naidu
- revanth reddy
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కేటీఆర్
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- నారా చంద్రబాబునాయుడు
- బాలకృష్ణ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- రేవంత్ రెడ్డి
- వామపక్ష పార్టీలు