Sun Nov 24 2024 08:19:08 GMT+0000 (Coordinated Universal Time)
సెర్చ్ వారెంట్ తో రేవంత్ ఇంటికి....?
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నారు. నిన్న ఉదయం మొదలయిన ఆదాయపు పన్ను శాఖ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మూడు రోజుల సెర్చ్ వారెంట్ తీసుకుని అధికారులు రేవంత్ రెడ్డికి వచ్చినట్లు తెలిసింది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఫోరెన్సిక్స్ నిపుణులు కీలక ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. ఓటు కు నోటు కేసులో ఉన్న ఉదయ సింహను రేవంత్ రెడ్డి ఇంటికి పిలిపించి, ఇద్దరినీ కూర్చోబెట్టి విచారించారు. మొత్తం మీద పకడ్బందీగా రేవంత్ రెడ్డిని ఐటీ ఉచ్చులో బిగిస్తున్నట్లే కన్పిస్తుంది. మూడు రోజల సెర్చ్ వారెంట్ తీసుకొచ్చారు కాబట్టి రేపు కూడా సోదాలు జరిగే అవకాశముంది.
Next Story