పవన్ కళ్యాన్‌కు ఆర్జీవీ తొమ్మిది ప్రశ్నలు
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నుంచి తెలుగుదేశం పార్టీని తన ట్వీట్లుతో ఇరుకున పెడుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాన్‌కు తొమ్మిది ప్రశ్నలు సంధించారు. ఎక్స్ (ఒకప్పటి ట్విటర్) వేదికగా జనసేనానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘స్కిల్’ కుంభకోణంలో తనకు ఏం అర్థమైందో కెమెరా వైపు చూస్తూ ఓ వీడియో చేపి పంపించాలని ఆయన పవన్‌ను కోరారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ పవన్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే.
ట్విట్టర్ వేదికగా జనసేనానిని ఇరుకున పెట్టిన వర్మ
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నుంచి తెలుగుదేశం పార్టీని తన ట్వీట్లుతో ఇరుకున పెడుతున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాన్‌కు తొమ్మిది ప్రశ్నలు సంధించారు. ఎక్స్ (ఒకప్పటి ట్విటర్) వేదికగా జనసేనానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘స్కిల్’ కుంభకోణంలో తనకు ఏం అర్థమైందో కెమెరా వైపు చూస్తూ ఓ వీడియో చేపి పంపించాలని ఆయన పవన్‌ను కోరారు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ పవన్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే. వర్మ ప్రశ్నలు ఆయన మాటల్లోనే...
గౌరవనీయులైన శ్రీ @ పవన్‌కళ్యాణ్ గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్
1) అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?
2) ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?
3) 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?
4) ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?
5) FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?
6) చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?
7) సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?
8) లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్గరౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?
9) నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?