కేసీఆర్….. జగన్ ను చూడు
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏపీలో అక్కడి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ఎలా విలీనం చేస్తున్నాడో చూడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. [more]
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏపీలో అక్కడి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ఎలా విలీనం చేస్తున్నాడో చూడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. [more]
ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏపీలో అక్కడి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ఎలా విలీనం చేస్తున్నాడో చూడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఓ వైపు జగన్ ఆర్టీసీ విలీనంపై ముందుకు పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ను విమర్శించడం మంచిది కాదన్నారు అశ్వద్ధామరెడ్డి. జగన్ తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ అవహేళన చేయడం చాలా బాధాకరమన్నారు. రాజకీయాలు అయిదేళ్ల కోసారి ఎలా వస్తాయో…. అదే విధంగా అన్ని కార్మిక సంఘాల్లో రెండేళ్లకోసారి ఎన్నికులుంటాయనే విషయం కేసీఆర్ కు తెలియదానని ప్రశ్నించారు.
హేళనగా మాట్లాడటం….
సీఎం కేసీఆర్ మాటలతో ఒత్తిడికి లోనై మరో కార్మికుడు గుండె పోటుతో చనిపోయారని, సీఎం ఇష్టానుసారంగా కార్మిక సంఘాలనాయకులపైమాట్లాడడం మంచిది కాదని అశ్వద్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు మంచివారేనంటున్న సీఎం కేసీఆర్ మరి కార్మికులే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నారన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎం కేసీఆర్ కూర్చొని సంతకం చేస్తే వేల బస్సులు రోడ్లపైకి వస్తాయనడం హస్సాస్పదమని, చట్టాలను కేసీఆర్ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీకి చెందిన దూర ప్రాంతాల బస్సులు లాభాలబాటలోనే నడుస్తున్నాయని, కేవలం హైదరాబాదులో నడుస్తున్న బస్సులకే నష్టం వస్తున్నట్లు చెప్పారు.