బెదిరింపులకు భయపడం
ఆర్టీసీ జేఏసీ రాజకీయ పక్షాలతో సమావేశమయింది. ఈ సందర్భంగా అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు ఆహ్వానించాల్సిందేనన్నారు. చర్చలు జరగనంత వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. [more]
ఆర్టీసీ జేఏసీ రాజకీయ పక్షాలతో సమావేశమయింది. ఈ సందర్భంగా అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు ఆహ్వానించాల్సిందేనన్నారు. చర్చలు జరగనంత వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. [more]
ఆర్టీసీ జేఏసీ రాజకీయ పక్షాలతో సమావేశమయింది. ఈ సందర్భంగా అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్లను చర్చలకు ఆహ్వానించాల్సిందేనన్నారు. చర్చలు జరగనంత వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అని, కార్పొరేషన్ ను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని అశ్వథ్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 32 శాతం ఉందని చెప్పారు. కేసీఆర్ బెదిరింపులకు కార్మికులు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఇప్పటివరకూ ఏ కార్మికుడూ విధులకు హాజరుకాలేదని అశ్వధ్దామరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా వ్యవహరించాలని అశ్వద్ధామరెడ్డి కోరారు. తెలంగాణ ఆర్టీసీ బోర్డు ఇంకా ఏర్పాటు కాలేదన్నారు.