చర్చల్లో ఇదే జరగనుందా?
ఆర్టీసీ జేఏసీతో నేతలతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆహ్వానం పలికింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖలో జరిగే చర్చలకు [more]
ఆర్టీసీ జేఏసీతో నేతలతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆహ్వానం పలికింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖలో జరిగే చర్చలకు [more]
ఆర్టీసీ జేఏసీతో నేతలతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఆహ్వానం పలికింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్ లోని రోడ్లు భవనాల శాఖలో జరిగే చర్చలకు రావాలని లేఖలను పంపింది. 21డిమాండ్లపైనే చర్చ జరుగుతుందని యాజమాన్యం ఆ లేఖలో పేర్కొంది. చర్చల్లో అధికారులు, జేఏసీ నేతలు పాల్గొంటారు. దీంతో ఆర్టీసీ జేఏసీ సమావేశమయింది. యాజమాన్యంతో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేదని కేసీఆర్ తేల్చి చెప్పడంతో దీనిపై కార్మిక సంఘాలు చర్చల్లో ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. చర్చలు అర్థాంతరంగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కార్మికసంఘాల నేతలు చెబుతున్నారు.