మొక్కుబడి తంతేనా…..
23 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో తలెత్తిన పరిణామాల తర్వాత ఆర్టీసీ యాజమాన్యం శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించింది. అనేక షరతులతో చర్చలకు వేదికైనటువంటి ఎర్రమంజిల్ [more]
23 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో తలెత్తిన పరిణామాల తర్వాత ఆర్టీసీ యాజమాన్యం శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించింది. అనేక షరతులతో చర్చలకు వేదికైనటువంటి ఎర్రమంజిల్ [more]
23 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెతో తలెత్తిన పరిణామాల తర్వాత ఆర్టీసీ యాజమాన్యం శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించింది. అనేక షరతులతో చర్చలకు వేదికైనటువంటి ఎర్రమంజిల్ లోని రోడ్డు భవనాల శాఖలోకి అనుమంతించారు. ఆర్టీసీ జేఏసీ నుంచి కేవలం నలుగురినే చర్చలకు అనుమతించారు. నాయకుల సెల్ ఫోన్లను కూడా చర్చల లోపలికి అనుమతించలేదు. ఇతర నేతలను కూడా చర్చలు జరిగే ఛాయలకు రానివ్వలేదు. భారీ పోలీసు బలగాలను అక్కడ మొహరించారు.
చర్చే లేదు…..
చర్చల్లో ఆర్టీసీ యాజమాన్యం దేనిపైనా చర్చించలేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని చెప్పడంతో దానికి జేఏసీ నేతలు అంగీకరించలేదు. మొత్తం అన్ని డిమాండ్లపైనా చర్చించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. దీనికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. చర్చల కోసం వెళ్లిన నేతలు ఏ డిమాండుపైనా చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు యాజమాన్యం సిద్ధంగా లేదని వారు ధ్వజమెత్తారు.
సమ్మె కొనసాగుతుంది
సమ్మె యథావిథిగా కొనసాగుతుందని జేఏసీ నేతలు చెప్పారు. ప్రభుత్వం నిర్భందంలో ఉంచి చర్చలు జరపాలని ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేవలం కోర్టు సూచనల మేరకే మొక్కుబడి తంతుగా చర్చలకు పిలిచినట్లుందని మండిపడ్డారు.