త్వరలోనే ఏపీకి బస్సు సర్వీసులు… అధికారుల భేటీ
అంతరాష్ట్ర సర్వీసుల రాకపోకలపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. బస్ భవన్ లో జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆరు నెలలుగా ఏపీ, [more]
అంతరాష్ట్ర సర్వీసుల రాకపోకలపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. బస్ భవన్ లో జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆరు నెలలుగా ఏపీ, [more]
అంతరాష్ట్ర సర్వీసుల రాకపోకలపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. బస్ భవన్ లో జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గత ఆరు నెలలుగా ఏపీ, తెలంగాణల మధ్య కరోనా కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సులు నడిపేందుకు ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లో సమానంగా బస్సులు సర్వీసులు నడపాలన్నది తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.