Sat Dec 28 2024 10:41:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇవ్వాళ సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సమ్మెపై ఉస్మానియా యూనివర్శిటికి చెందిన ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ [more]
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇవ్వాళ సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సమ్మెపై ఉస్మానియా యూనివర్శిటికి చెందిన ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ [more]
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇవ్వాళ సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సమ్మెపై ఉస్మానియా యూనివర్శిటికి చెందిన ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కార్మికుల సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
Next Story