Wed Apr 02 2025 17:35:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఉక్రెయిన్ పై రష్యా మిస్సైల్స్ తో దాడులు
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తుంది. ఏకకాలంలో మిసైళ్లతో రష్యా ఉక్రెయిన్ పై దాడులు జరుపుతోంది.

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తుంది. ఏకకాలంలో మిసైళ్లతో రష్యా ఉక్రెయిన్ పై దాడులు జరుపుతోంది. దీంతో అనేక మంది మృతి చెందారని తెలిపారు. రాజధాని కీవ్ తో సహా పలు నగరాల్లో రష్యా దాడులను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. మిస్సైల్ దాడులతో ప్రజలు భయకంపితులయి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి కొందరు దూరిపోయారు.
ఎంతమంది చనిపోయారన్నది...?
ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. పలు వంతెనలను రష్యా ఉక్రెయిన్ లో పేల్చి వేసింది. రష్యా చెప్పినట్లుగానే చేసింది. నెలల పాటు సాగుతున్న యుద్ధంలో ఏమీ సాధించలేకపోవడంతో చివరకు మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కీవ్ నగరంలోని భారీ వంతెనను కూల్చి వేసింది. భారీ భవనాలను కూడా నేలమట్టం చేసినట్లు సమాచారం.
Next Story