Mon Dec 23 2024 06:54:55 GMT+0000 (Coordinated Universal Time)
Sara Tendulkar : సచిన్ కూతురు సారా పోస్టు.. తన డీప్‌ఫేక్ ఫొటోలు..
సారా టెండూల్కర్ కూడా ఈ డీప్‌ఫేక్ ఫోటో సమస్యని ఎదుర్కొన్నట్లు, అలాగే తన పేరుతో రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్స్..
Sara Tendulkar : క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక అలాగే టీమ్ ఇండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్‌తో ఈమె ప్రేమలో ఉందంటూ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతుంటారు. కాగా సారా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన డీప్‌ఫేక్ ఫొటోలు గురించి ఓ పోస్ట్ వేశారు.
ఈమధ్య కాలంలో డీప్‌ఫేక్ వీడియోలో సెలబ్రిటీస్ కి పెద్ద సమస్యగా మారాయి. రష్మిక, కాజోల్ ఈ డీప్‌ఫేక్ వీడియో సమస్యలను ఎదుర్కొన్నారు. తాజాగా సారా టెండూల్కర్ కూడా ఈ డీప్‌ఫేక్ ఫోటో సమస్యని ఎదుర్కొన్నట్లు, అలాగే తన పేరుతో రన్ చేస్తున్న ఫేక్ అకౌంట్స్ గురించి కూడా ఆమె మాట్లాడారు. ట్విట్టర్ లో సారా టెండూల్కర్ పేరుతో ఒక అకౌంట్ రన్ చేస్తున్నారు. అందులో శుభ్‌మన్ గిల్ పై సారా ప్రేమ తెలుపుతున్నట్లుగా పోస్టులు వేస్తారు.
తన బ్రదర్ అర్జున్ తెందూల్కర్‌తో సారా కలిసి ఉన్న ఒక ఫోటోని మార్ఫ్ చేసి.. అర్జున్ కి బదులు శుభ్‌మన్ గిల్ కనిపించేలా చేశారు. గిల్ తో సారా ఉన్న ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ డీప్‌ఫేక్ ఫోటో గురించే మాట్లాడుతూనే సారా పోస్ట్ వేశారు. మన బాధలు, సంతోషాలు, డైలీ విషయాలు షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక గ్రేట్ ప్లాట్ఫార్మ్ అని, కానీ దానిని కొందరు దుర్వినియోగం చేస్తుండడం కలవరపెడుతుందని సారా పేర్కొన్నారు.
"నా డీప్‌ఫేక్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాను. అలాగే నా పేరు మీద ట్విట్టర్ లో ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి నెటిజన్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ట్విట్టర్ లో ఎలాంటి అకౌంట్ లేదు. ఆ ఫేక్ అకౌంట్ ని ట్విట్టర్ గుర్తించి సస్పెండ్ చేస్తుందని భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.
Next Story