ఏం ఘోరం జరిగిందని ఆ వీరంగం..?
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెలుగుదేశం నాయకుల వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన చంద్రబాబును తెదేపా నేతలు, ఎల్లో మీడియా సమర్థించడంపై ఆయన మండిపడ్డారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో కుంభకోణాలు తప్ప చంద్రబాబుకు మరేమీ తెలియదని ఆయన విమర్శించారు. అరెస్ట్‌ను చంద్రబాబు హుందాగా స్వీకరించి ఉంటే బాగుండేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం నాయకులపై సజ్జల ఫైర్

చంద్రబాబు అరెస్ట్ తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా తెలుగుదేశం నాయకులు ప్రవర్తించారని సజ్జల ఆరోపించారు. ప్రపంచంలో జరగరాని ఘోరం జరిగినట్లు లోకేష్, పవన్ కళ్యాన్ రియాక్ట్ ఆయ్యారని, సొంత పుత్రుడి కంటే దత్త పుత్రుడే వీరంగం వేశారని ఆయన ఫైర్ అయ్యారు. హెలికాప్టర్లో విజయవాడ రండి అంటే అక్కడ కూడా చంద్రబాబు పబ్లిసిటీ డ్రామా ఆడారని వైకాపా ప్రధాన కార్యదర్శి దుయ్యబట్టారు. ఈనాడు కూడా బూతులు రాయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబును జగన్ ప్రభుత్వం టచ్ చేయడమేంటని ఎల్లో మీడియా తెగ బాధ పడిపోయిందని సజ్జల వ్యాఖ్యానించారు. జవాబుదారీతనమే జగన్ విశ్వసించే ప్రధమ సూత్రమని ఆయన పేర్కొన్నారు. .
ఒక నేరానికి సంబంధించి తీగ లాగితే డొంక చంద్రబాబు వరకూ వెళ్లిందని, చేసిన దానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, ఎదురు దబాయింపులతో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా తెలుగుదేశం నేతలు ప్రవర్తిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం పెద్ద విషయం కాదని, భవిష్యత్తులో ఆయన నేరం తప్పకుండా రుజవు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిజాయితే కోరుకునే ప్రతీ ఒక్కరూ చంద్రబాబు రిమాండ్‌పై ఆనందపడతారని సజ్జల వెల్లడిరచారు. పుంగనూరు కేసులోనూ సాక్ష్యాధారాలున్నాయని, ఐటీ నోటీసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని, అసైన్డ్ ల్యాండ్ లాంటి విషయాల్లో చంద్రబాబు అవినీతిపై ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు.