కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం దేనికని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కేఆర్ఎంబీ సమావేశానికి ఎందుకు కేసీఆర్ హాజరుకావడం లేదన్నారు. ఢిల్లీకి వెళితే ఏమవుతుందన్నారు. [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం దేనికని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కేఆర్ఎంబీ సమావేశానికి ఎందుకు కేసీఆర్ హాజరుకావడం లేదన్నారు. ఢిల్లీకి వెళితే ఏమవుతుందన్నారు. నీటి వివాదాన్ని కేఆర్ఎంబీ లో తేల్చుకోకుండా ఢిల్లీకి వెళ్లడం దేనికని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఏపీకి న్యాయపరంగా రావాల్సిన వాటా కోసం కేంద్రం దృష్టికి తాము కూడా తీసుకెళతామని చెప్పారు. కేఆర్ఎంబీ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి కన్పించడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు వల్లనే నేడు ఈ దుస్థితికి చేరుకుందని ఆయన అన్నారు. నాడు పారిపోయి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.