Tue Nov 05 2024 23:15:15 GMT+0000 (Coordinated Universal Time)
టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీం సీరియస్
ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల..
న్యూ ఢిల్లీ : ఈ ఏడాది సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఎన్ఐఓఎస్ సహా ఇతర బోర్డులు ఆఫ్లైన్లో నిర్వహించే 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఏ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని.. పరీక్షల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూనే.. ఇలాంటి పిటిషన్లు వేయడం వల్ల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో లేనిపోని ఆశలు కలగడమే కాకుండా.. గందరగోళానికి గురవుతారని తెలిపింది.
Also Read : నయా ట్రెండ్.. హైదరాబాద్ లో డ్రైవ్ ఇన్ థియేటర్
కరోనాను సాకుగా చూపించి.. పరీక్షలను రద్దు చేయాలనడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థులు, అధికారులను వారి కర్తవ్యాలను నిర్వర్తించనివ్వాలని, ఇలాంటి పిటిషన్లు వేసి వారి తప్పుడు భావనను కలిగించరాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. మరికొన్ని రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు మార్చి 4 నుంచి మొదలవ్వనున్నాయి.
Next Story