Fri Dec 20 2024 10:06:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇదేం పిచ్ రా బాబూ.. పిచ్చి లేపింది
లక్నోలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగింది
లక్నోలో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ చివరి బాల్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఒక సిక్స్ లేదు. ఫోర్లు కూడా అతి తక్కువే. టీ 20లలో అతి తక్కువ స్కోరు. ఇదే పిచ్ రా బాబూ అని తలలు పట్టుకున్నారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లు వరసగా విఫలమవుతూ ఉంటే మన బౌలర్ల పెతాపమోమో అనుకున్నాం. ఒక్కొక్కరు పెవిలియన్ బాట పడుతుండటం, 99 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది సిరీస్ పై ఆశలు నిలిచినట్లేననని భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సూర్య ఒక్క సిక్స్ లేకుండా...
కానీ తర్వాత భారత్ బ్యాటింగ్ ప్రారంభిస్తే కాని అసలు సంగతి తెలియలేదు. ఎంత బాదినా ఒక్క ఫోరూ రాకపోయె. వరసగా మన బ్యాట్స్మెన్ లు కూడా పెవిలియన్ చేరుతున్నారు. రన్ అవుట్ లు జరుగుతున్నాయి. జరుగుతున్నది ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. సూర్యకుమార్ తన బ్యాట్ తో ఒక్క సిక్సర్ ను కూడా కొట్టలేకపోయాడు. భారత్ కూడా నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
చివరి వరకూ...
చివరి రెండు బాల్స్ కు మూడు పరుగులు కావాల్సి ఉండగా ఒక బంతి మిగిలి ఉండగా సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి భారత్ ను గెలిపించారనుకోండి. ఇరు జట్లలో సూర్యకుమార్ దే అత్యధిక స్కోరు. అదెంతో తెలుసా? 26 మాత్రమే. అంటే 26 ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు. స్పిన్నర్లదే ఈ పిచ్ మీద రాజ్యంగా కనిపించింది. వారు మాత్రమే బౌలింగ్ చేయగలిగిన పిచ్ లక్నో స్టేడియం. మొత్తం మీద చివరకు గెలిచాం కాని.. చివరి బంతి వరకూ టెన్షన్ తప్పలేదు. బుధవారం జరిగే మ్యాచ్ లో సిరీస్ ఎవరిదో తేలనుంది.
- Tags
- india
- new zealand
Next Story