Sat Nov 23 2024 01:13:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ కు ఆజాద్ గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఆయన సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. సీనియర్ నేతగా గులాం నబీ ఆజాద్ గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. జీ 23 అనే పేరుతో కాంగ్రెస్ నేతలను కలుపుకుని పార్టీ బలోపేతానికి ఆయన చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ చీఫ్ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఆ నిర్ణయం వెలువడిన గంటలోనే ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవులను చేపట్టలేకపోతున్నామని చెప్పారు.
కొంత కాలంగా అసంతృప్తి....
గత కొంత కాలంగా గులాం నబీ ఆజాద్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అసంతృప్త నేతలతో కలిసి ప్రత్యేక సమావేశాలు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన గులాం నబీ ఆజాద్ నేడు తన పదవులుకు రాజీనామా చేశారు. ఆయన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. గులాం నబీ ఆజాద్ రాజీనామాతో పార్టీ సీనియర్ నేత దూరమయినట్లు అయింది. అయితే పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేకపోతే మరో పార్టీలో చేరతారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story