ఆ ఉగ్రవాదులు భారత్ వచ్చారు..!
శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకేరోజు వరుసగా ఆత్మహుతి దాడులకు పాల్పడి 250 మందికి [more]
శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకేరోజు వరుసగా ఆత్మహుతి దాడులకు పాల్పడి 250 మందికి [more]
శ్రీలంకలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకేరోజు వరుసగా ఆత్మహుతి దాడులకు పాల్పడి 250 మందికి పైగా అమాయకులను పెట్టుకున్న ఉగ్రవాదులు భారత్ కు వచ్చారని ఆ దేశ ఆర్మీ అధికారి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. భారత్ లో బెంగళూరు, కేరళ, కశ్మీర్ లో వారు ఉండి వచ్చినట్లు తమకు ఆధారాలు లభించాయని, వారు అక్కడ శిక్షణ తీసుకొని ఉండవచ్చని అనుమానం ఉందని ఆయన తెలిపారు. లేదా ఇతర ఉగ్రవాద సంస్థల వారిని కలిసేందుకు వారు భారత్ కు వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని భారత్ బదులిచ్చింది. న్యూజిల్యాండ్ లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఐసిస్ ఉగ్రవాదుల ప్రోద్బలంతో శ్రీలంకలో స్థానిక ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆత్మహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.