శబరిమలలో ఏపీ కుటుంబం... ఉద్రిక్తత..!
శబరిమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అన్ని వయస్సుల వారికి ఆలయ ప్రవేశానికి సుప్రీం కోర్టు అవకాశం కలిపించడం... ఇవాళ ఆలయం తెరుచుకోనుండటం... ఆలయానికి ఎలాగైనా వెళతామని మహిళా సంఘాలు చెప్పడం... అడ్డుకుని తీరుతామని హిందూ సంఘాలు హెచ్చరించడం వంటి పరిణామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ సంఘాలు కొండపైకి వెళ్లే దారిలో ఉండి వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. మహిళలు ఎవరైనా వస్తే వారిని బలవంతంగా తిరిగి పంపించేస్తున్నారు. పలు వాహనాలపై దాడులు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన.....
ముఖ్యంగా బీజేపీ, శివసేన పార్టీల నేతలు మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ తెలుగు కుటుంబం అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. వారిలో మహిళ కూడా ఉండటంతో మార్గమధ్యంలో ఆందోళనకారులు అడ్డుకుని బలవంతంగా వెనక్కి పంపారు. అయితే, తమ కుటుంబసభ్యుడికి ఆరోగ్యసమస్య తీరినందున స్వామి దర్శనానికి వచ్చామని, ఆందోళనల గురించి తెలియదని సదరు కుటుంబసభ్యులు అంటున్నారు.